Thursday 12 December 2013

అవినీతి పులిరాజా !!

Great Politics calls for noble feelings of heart!
ఈ వాక్యం ఎక్కడో చదివిన గుర్తు. సామాజిక గమ్యం, గమనాన్ని నిర్దేశించేవి పాలిటిక్సే. ప్రజాభ్యున్నతే పరమావధిగా మహోన్నత రాజకీయ జీవితం గడిపి చారిత్రక స్మృతిపథంలో చిరస్మరణీయులుగా నిలిచిన అబ్రహాం లింకన్, సుభాష్ బోస్ లాంటి మహనీయులు చాలామందే కనిపిస్తారు. కానీ నేటి పాలిటిక్సు దీనికి కంప్లీట్ రివర్స్. అవినీతి, అక్రమార్జనే నేటి రాజకీయాల తారకమంత్రం. భ్రష్ట రాజకీయాలు చేసి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న నేతలపై, అలాంటి నేతల బలహీనతల్ని క్యాష్ చేసుకునే గిరీశం లాంటి వారిపై ఒక సెటైర్ ‘‘అవినీతి పులిరాజా!’’ శీర్షికతో ఈ రోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో. Have an insight into it. Thank you :-)



9 comments:

  1. కోటివిద్యలూ కోట్ల కొరకే అనే నినాదం బాగుంది, హ్యుమరస్ గా అనిపించినా చక్కని శైలి మీది.
    నాగరాజ్ గారూ, నేను మీ నిత్య బ్లాగ్ విద్యార్దినిని అయిపోయాను.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయాభిమానానికి థాంక్సండీ! మీ కామెంట్ చివర్లో బోల్డంత పెద్ద పదం వాడేసి నన్ను బాగా గాభరా పెట్టేశారు. ఏదో కాలక్షేపం బఠానీల్లా సరదాగా పొలిటికల్ సెటైర్సు రాయడం తప్ప నాకేమీ తెలీదండి. పైగా బ్లాగుల్లోను, బయటా ఇప్పుడిప్పడే బుడిబుడి అడుగులు వేస్తున్న బుడుగును మాత్రమే నేను. మీలాంటి పెద్దవాళ్ల దీవెనలు నా రాతల్లో తప్పటడుగులు పడనీయకుండా శ్రీరామరక్షలా కాపాడతాయని అభిలషిస్తాను. నిజానికి సెటైర్లతో పోలిస్తే కవితలు, కథలే మనసుల్ని, మనుషుల్ని కదిలిస్తాయని నేను నమ్ముతాను. థాంక్యూ.

      Delete
    2. కవితలు సున్నితంగా నెమలి ఈకతో రాసినట్లుంటాయి,
      సెటైర్లు కత్త్తిలా పదునుగా ఉంటాయి, నేటి సమాజానికి ఆ శైలే ఆసరం.
      మీరు టైంపాస్ బటాణీలు కాదు, టైం ని సరిదిద్దే ఆటంబాంబులు పేలచండి (మీ పోస్టుల్లో) ఓ మంచి పాత్రికేయులుగా మీ కలాన్ని సామాజిక అంశాలపై ఎక్కుపెట్టండి. మీరు చాలా బాగా రాస్తున్నారు, బద్దకంగా తప్పించుకోకుండా బుద్దిగా బ్లాగ్ రాయండి:-))

      Delete
    3. అదేంటోనండీ, నా బద్ధకాన్ని ఎంత భద్రంగా దాచిపెడదామన్నా అందరూ ఇట్టే పసిగట్టేస్తుంటారు. కనీసం 2014లోనైనా నేను బద్ధకిస్టు అన్న విషయం ఎవ్వరికీ తెలీకుండా జరూరుగా గాఠి జాగ్రత్తలు తీసుకోవాలి. సెటైర్లపై మీ ప్రశంస బాగుంది. మీరన్నట్టు భావకవిత్వం సున్నితమే అయినా; శ్రీశ్రీ కవితల్ని చదివితే అవి విచ్చుకత్తుల కంటే పదునుగా అనిపిస్తుంటాయి నాకు. సరే కానీయండి, మీరన్నట్లే రాయడానికి ప్రయత్నిస్తాలెండి :-)

      Delete
    4. రాస్తా లెండీ...............అని చెప్పి రెండో రోజిది.
      బద్దక చక్ర," "బద్దక సామ్రాట్" ," బద్దక వీర ", రెబల్ బద్దక ..వగైరా,వగైరా టైటిల్స్ తీసుకుందురు గాని 2014 లో..:-))

      Delete
    5. కవితలూ, కతలూ బాగుంటాయి కనుక మీరు రాసేయండీ నేను తీరిగ్గ చదువుకుంటానంటే కుదరదు.

      Delete
    6. అమ్మో... కవితలు, కథలా? వాటిల్లో గొప్ప జ్ఞానశూన్యులం లెండి. కవితలు, కథలనే గొప్ప పనులని మీ లాంటివాళ్లే చేయాలి. కావాలంటే వాటన్నింటినీ ఓపిగ్గా చదివి, కావలసినన్ని ఆనంద కన్నీళ్లు, కరుణ కన్నీళ్లను రాల్చగలను. ఏదో అమావాస్యకో, పున్నమికో మాత్రమే ఓ సెటైర్ రాస్తానని మోడ్రన్ గిరీశం ముందు భీష్మప్రతిజ్ఞ చేశాను కాబట్టి నా రాతలన్నీ ఆ మేరకే ఆ మోతాదులోనే ఉంటాయి. మీరు బద్ధక రత్న, బద్ధక ప్రవీణ, బద్ధక శేఖర, బద్ధక సింహం, వగైరా వగైరా ఎన్ని కనిపెట్టి నా మీదకు వదిలినా అవేవీ పెద్దగా పనిచేయవేమోనని నా సెవెంత్ సెన్స్ చెబుతోంది. థాంక్యూ ఫర్ ది కామెంట్స్ అండీ :-)

      Delete
  2. Very nice write up as usual.
    But I guess Girisham political school may not be that attractive unless he comes up with very creative ideas( instead of he giving classes if it is exchange of plans, sharing of positions, distribution of wealth strategies etc) because people are already so well versed in these and have immense knowledge (kudos to non stop TV channels) . Just kidding !
    On serious note really these kind of politics became so obvious that if someone talks simple, fair and logical they are considered as Cavemen.
    Small suggestion if you don't mind, Satire's, representing serious issues in lighter vein sometimes is okay and needed. But since you have very good writing skills I think you can represent the issue/topics to younger audience to provoke their thoughts, make them think, do there search .
    Sorry for taking the liberty to suggest you

    Surabhi

    ReplyDelete
    Replies
    1. సురభి గారు, థాంక్సండీ.
      మీది సునిశిత పరిశీలన. మీరన్నది నిజమే. ఏం చేయమంటారు, చెప్పండి. నేటి కుళ్లు రాజకీయాల పుణ్యమాని మోడ్రన్ గిరీశంలో క్రియేటివిటీ, అలాగే ఉరుకులు పరుగుల 24x7 ఉద్యోగాల పుణ్యమాని నా బుర్రలో కూడా గ్రే మ్యాటర్ క్వాంటిటీ తగ్గిపోయిందేమోనని గొప్ప డౌటుగా ఉందండీ! స్టాక్ మార్కెట్ లెవల్లో.. IQ లెవెల్స్ కూడా దారుణంగా పతనమైపోతున్నట్టున్నాయ్, ప్చ్! కొత్తదనం కోసం ప్రయత్నించిన ప్రతీసారీ, యువరాజు రాహుల్ గాంధీ ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా పదేపదే చుక్కెదురవుతోంది. ఏం చేయాలో ఏంటో పాలు పోవట్లేదు :-)
      మీరన్నట్టు, ప్రతీ వ్యవస్థ కూడా తనను పోలిన, తనలాగే ఆలోచించుకునే మనుషుల సమూహాన్ని సృష్టించుకుంటుందట. అన్నివిధాలా భ్రష్టు పట్టిపోతున్న ఈ వ్యవస్థ... ప్రజల ఆలోచనా సరళిని, స్థాయిని దారుణంగా దిగజార్చివేస్తోంది. ఎవరన్నా మంచితనం, మానవత్వాల గురించి మాట్లాడితే పురుగును చూసినట్టు చూస్తున్నారు. ఏం చేస్తాం? ఎవరైనా నడుం బిగించి ఈ వ్యవస్థను సమూలంగా మారిస్తే బావుణ్ణు!
      ఇక నేను రాసే సెటైర్లంటారా... మీరన్నది నిజమే, మార్క్ ట్వైన్, చార్లీ చాప్లిన్ ల ప్రభావమేదో బాగా పడ్డట్టుంది. అది అంత ఈజీగా వదిలిపెట్టట్లేదు. చూడండి... మీరు అంత సీరియస్ గా కామెంట్ రాశారా, నేనూ సీరియస్సుగానే రాద్దామని మొదలుపెట్టా, కానీ అసంకల్పితంగానే ఇక్కడ రాస్తున్నదంతా లైటర్ వీన్ లో నడుస్తోంది. లైటర్ వీన్ అన్నది న్యూరో ప్లాస్టిసిటీ అయిపోయినట్టుంది. నాకు ఇంకాస్త వయసు పైబడి, మెచ్యూరిటీ వస్తే గానీ లైట్ మైండ్ పోనట్టుంది. మీ సలహా ప్రకారమే, మెల్లగా హాస్య-వ్యంగ్య రసాల నుండి కరుణ రసం వైపు మళ్లే ప్రయత్నం చేస్తాను. కథలు రాయాలన్నది నా కోరిక. అస్సలది తీరుతుందో లేదో...?? పై వాడికే ఎరుక!
      మీ సలహాలు, సూచనలు, విమర్శలు ఏవైనా కానీయండి, మీరు నిస్సంకోచంగా, కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పేయండి. సత్యాన్ని స్వీకరించడం కంటే ఎవరికైనా కావాల్సిందేముంటుంది, చెప్పండి. ఈ బ్లాగ్ మీద దృష్టి సారించి బ్లాగర్ చేత మంచి రాతలు రాయించాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. థాంక్యూ :-)

      Delete