యువనేతకు బెయిల్ మంజూరు!
సోమవారం ఇదే శిఖర వార్త!
కాదు కాదు, అదొక వైరస్ వార్త!
ఈ వార్తా వైరస్ సృష్టించిన కల్లోలం ముందు మొత్తం వైరస్ జాతంతా సిగ్గుతో తలదించుకుంది!
కాదు కాదు, అదొక వైరస్ వార్త!
ఈ వార్తా వైరస్ సృష్టించిన కల్లోలం ముందు మొత్తం వైరస్ జాతంతా సిగ్గుతో తలదించుకుంది!
మొదట తెలుగు మీడియా కోడై కూసింది!
ఆపై జాతీయ మీడియా జోరీగై జనం చెవుల్లో చిల్లులు పెట్టింది !!
ఆపై ప్రపంచ మీడియా.. ఎలా స్పందించిందో వీక్షించలేకపోయినందుకు రాత్రంతా నిద్ర పట్టలేదు!!
ఆపై జాతీయ మీడియా జోరీగై జనం చెవుల్లో చిల్లులు పెట్టింది !!
ఆపై ప్రపంచ మీడియా.. ఎలా స్పందించిందో వీక్షించలేకపోయినందుకు రాత్రంతా నిద్ర పట్టలేదు!!
ఆమధ్య ఉట్టి పుణ్యానికే ప్రపంచాన్ని గగ్గోలు పెట్టించిన ఎయిడ్స్ మహమ్మారికి మందు కనిపెట్టేశానని ఎవడన్నా ప్రకటించినా సరే, ఈ లెవెల్లో మీడియా స్పందిస్తుందో, లేదో? నాకైతే డౌటే! రాష్ట్ర ఆశాజ్యోతి యువనేత విషయంలో మీడియా నిష్పక్షపాత విశృంఖల విలయతాండవ వైఖరి చూసి ముచ్చటేసింది. మీడియా సృష్టించిన 24 గంటల దావానల వైరస్ వార్తా స్రవంతిలో మొదట హైదరాబాదు, పిమ్మట రాష్ట్రమ్మొత్తం, తదుపరి దేశం యావత్తూ తడిసి ముద్దైపోయి, తరించిపోయింది. పాపం, ప్రజలకే ఈ వార్తను చూసి సంబురాలు జరుపుకోవాలా? లేక ముక్కున వేలేసుకోవాలా? లేక బిక్కమొగమేస్కుని మిన్నకుండిపోవాలా? అసలేం చేయాలో అర్థం కాక సైలెంటుగా ఉండిపోయారు. జనం ఖర్మ కాకపోతే, అదేంటో, మీడియా ఎప్పుడూ ప్రజల భావోద్వేగాలకు పెను సవాళ్లను విసురుతుంటుంది. సర్లే, ఈ బెయిల్ విషయమై కవులు, కళాకారులు, పండితులు, ఆర్థికవేత్తలు, మేధావులు ఎలా స్పందిస్తారో చూసి, ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దామని ప్రజలు డిసైడైపోయి జడత్వంలోకి జారుకున్నారు. ఈలోగా ఏం జరిగిందంటే....
‘‘ఇదొక శుభదినం.
రాష్ట్ర చరిత్రలోనే, కాదు కాదు, దేశ చరిత్రలో ఒక పర్వదినం.
మన యువనేత రాజకీయాలకే తలమానికమై నిలిచాడు. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా; అస్సాం నుండి గుజరాత్ దాకా ఎవ్వడూ సాధించలేని ఘనతను మనవాడు సాధించాడు. రికార్డులన్నీ మన యువనేతవే. ఆస్తులు కూడబెట్టడంలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయాడు. కారాగారవాసంలో సైతం కొత్త పోకడలు సృష్టించాడు. పట్టువదలని విక్రమార్కుడిలా బెయిల్ సాధించాడు. కొమ్ములు తిరిగిన హైకమాండునే ప్రసన్నం చేసుకున్నాడు. ఇంత జరిగినా ఏమాత్రం ఆదరణ తగ్గకుండా మ్యాజిక్ చేస్తున్నాడు. భేష్! ఇకపై నేతలెవ్వరూ అవినీతికి, అక్రమార్జనకు పాల్పడేందుకు ఏమాత్రం మొహమాట పడక్కర్లేదు. జైళ్లకెళ్లేందుకు అస్సలు సిగ్గు పడక్కర్లేదు. బెయిల్ దక్కదేమో అన్న బెంగను ఇహ తుంగలో తొక్కవచ్చు. ఇకపై అన్నింటికీ, మనందరికీ యువనేతే మార్గదర్శి!! పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం (అ)రాజకీయాల్ని వెలగబెట్టేందుకు. ప్రజాధనం కొల్లగొట్టేందుకు... ’’ అంటూ చెంచల్ గూడ జైలు ముందు ఓ మీటింగు పెట్టేసి మాటల తూటాలతో మైకును విరగ్గొడుతున్నాడు ఓ గల్లీ లెవెల్ లీడర్... మిగతా గల్లీ లెవెల్ అమెచ్యూర్ లీడర్లనుద్దేశించి!

‘‘ఇక ప్రజలంతా నిశ్చింతగా ఉండొచ్చు. గుండె మీద చేయేసుకుని నిద్రపోవచ్చు. జన గర్జనలు అక్కర్లేదు. సాగర ఘోషలు అవసరం లేదు. మిలియన్ మార్చులు చేయాల్సిన పనిలేదు. ఉద్యోగులు ముష్టియుద్ధాలు చేసుకోనక్కర్లేదు. యువకులు ఆత్మహత్యలు పాల్పడనక్కర్లేదు. దుష్టచతుష్టయం హైకమాండు బారిన పడి రాష్ట్రం రెండుగా విడిపోతుందా లేక మూడు ముక్కలైపోతుందా అన్న ఆందోళనలు అసలే అక్కర్లేదు. ఏది ఏమైనా, ఏది ఏమీ కాకపోయినా, తెలుగుజాతిని భుజం తట్టి, వెన్ను చరచి, ఆలింగనం చేసుకుని, ఓదార్చి, సాంత్వన చేకూర్చడానికి యువనేత జైలు గోడల్ని బద్ధలు కొట్టుకుని మళ్లీ మనమధ్యకు వచ్చేశాడు. ఇక భయం ఎంతమాత్రం అవసరం లేదు. వచ్చేశాయ్ వచ్చేశాయ్, జగన్మాథ జగన్నాథ, జగన్ నాథుడి రథ చక్రాల్... ’’ అంటూ తెలుగుజాతి ఆత్మశాంతి సభలో అవిరళంగా ఓదార్పు వచనాలు పలుకుతున్నాడు ఓ ప్రవక్త.
‘‘ఈ రోజు... భలే మంచిరోజు. యావద్భారతానికి అభయహస్తం లభించిన రోజు. ఇకపై ఉల్లి ధర గురించి లొల్లి చేయాల్సిన పనిలేదు. పాతాళానికి పడిపోయిన రూపాయి బూస్ట్ తాగి రివర్స్ బంగీ జంప్ చేసి ఆకాశానికి ఎగురుతుంది. స్టాక్ మార్కెట్లో ఇక మీదట రోజూ బుల్ రన్ కొనసాగుతుంది. ఐసీయులో స్ట్రెచర్ మీదున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇక నిషేధిత స్టెరాయిడ్స్ తీసుకున్న రన్నర్ లా దూసుకుపోతుంది. వ్యాపారం కోసం, పెట్టుబడుల కోసం ఇకపై అమెరికోడి ముందు బాంచన్ కాల్మొక్త అని వెంపర్లాడిన అవసరం లేదు. జాతి యావత్తూ ఇకపై సుభిక్షంగా ఉంటుంది. యువనేత పునరాగమనంతో గత ఏడాదికాలంగా త్రిశంకుస్వర్గంలో, చీకట్లో మగ్గిపోయిన అపార ధనరాశులు ఇకపై నిప్పులు చిమ్ముకుంటూ బయటకొచ్చి పెట్టుబడులుగా ప్రవహించి అటు వ్యవసాయాన్ని, ఇటు పారిశ్రామిక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించి జాతిని సుభిక్షం చేస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఉందిలే మంచికాలం ముందుముందునా... అందరూ సుఖపడాలి నంద నందనా... ’’ అంటూ ఢిల్లీలోని వార్ రూమ్ అధిష్ఠాన సమావేశంలో మౌనవ్రతాన్ని వీడిన మన్మోహన్ సింగు మాంచి మెలోడి పాడుకుంటూ మెడిటేషన్ లోకి వెళ్లిపోయాడు.
మళ్లీ మీడియా విశ్వరూప సందర్శనానికొద్దాం. మర్నాడు రాజధానిలో అంగుళమంగుళం కెమెరాల మోహరింపులు జరిగిపోయాయి. గల్లీగల్లీ చివర ఓ రిపోర్టరు నిరంతర వార్తా స్రవంతిని అందజేస్తున్నాడు. చెంచల్ గూడ దగ్గర మీడియా తొక్కిసలాట... మునుపటి తొక్కిసలాటల రికార్డుల్ని బద్ధలుకొట్టింది. టీవీల్లో స్టూడియాల్లో పండితుల, మేధావుల అపూర్వమైన, అద్భుతమైన చర్చోపచర్చలు నిరంతరాయంగా కొనసా...గుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఇంత జరిగినా, జరుగుతున్నా... యువనేత బెయిల్ విషయమై ఇంకా ఎలాంటి భావోద్వేగంతో స్పందించాలో తెలీక జనం తికమకపడుతూనే, గందరగోళపడుతూనే ఉన్నారు. పాపం... జగన్ కష్టాలు, ఇప్పడు జనానికొచ్చినట్టున్నాయ్! హతవిధీ!!