Tuesday, 25 February 2014

రాజకీయ సిత్రాలు... సూడర బాబో!!

 డుం..డుం..డుం..
ఇందుమూలంగా...
యావన్మంది జనానికీ...
తెలియజేయడమేమనగా...
ఈ సమ్మరులో నాల్గు గొప్ప సినిమాలు రిలీజవుతున్నాయహో!!
పుర ప్రజలంతా చూసి (చదివి) ఏది హిట్టో, ఏది ఫట్టో తెలియజేయ ప్రార్థన!!!
గమనిక: * టిక్కెట్లు కొనాల్సిన పన్లేదు ** అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ *** షరతులేం వర్తించవ్!
ఇవాళ్టి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ‘‘రాజకీయ సిత్రాల’’ పేరిట ఓ వ్యంగ్య కథనం !!!
నేడే చూడండి..!!! సారీ సారీ, ఇప్పుడే చదవండీ!!! :-)) 


Monday, 27 January 2014

కనబడుటలేదు!!

బ్రేకింగ్ న్యూస్!!

వార్త: కనబడుట లేదు
ఎవరు: యువరాజా వారు
ఎంతకాలంగా: కొంతకాలంగా
ఎందుకు: ఉత్తినే అలిగి వెళ్లిపోయారట
వదంతి: ప్రధాని కానేమోననే బెంగతో...
ఆనవాళ్లు: మాయని తెల్లచొక్కా, గీయని నల్లగడ్డం
సందేహం: ఢిల్లీ గల్లీల్లోనే తచ్చాడుతున్నాడని... 
గమనిక: నీ రాకకోసం... రాజమాత అంతర్వాణిని అక్కున చేర్చుకుని రేయింబవళ్లూ వెక్కివెక్కి ఏడుస్తోంది. వృద్ధమంత్రి ఎప్పట్లాగే మౌనంగా మనసులో రోధిస్తున్నాడు. వంధిమాగధులు, భట్రాజులు గుండెలవిసేలా భోరున విలపిస్తున్నారు. వివరం తెలిస్తే కాకితో కబురుపెట్టండి. వీలైతే, కాబోయే ప్రధానికి కచ్చితంగా నీవేనని చెప్పి, ఒప్పించి వెంటకబెట్టుకు వచ్చినవారికి మెచ్చే నజరానా ఉండును.
నేటి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో Mr Perfect రాహుల్ బాబాపై ఓ చిన్ని లైటర్ వీన్ సెటైర్! :-)