బ్రేకింగ్ న్యూస్!!
వార్త: కనబడుట లేదు
ఎవరు: యువరాజా వారు
ఎంతకాలంగా: కొంతకాలంగా
ఎందుకు: ఉత్తినే అలిగి వెళ్లిపోయారట
ఎంతకాలంగా: కొంతకాలంగా
ఎందుకు: ఉత్తినే అలిగి వెళ్లిపోయారట
వదంతి: ప్రధాని కానేమోననే బెంగతో...
ఆనవాళ్లు: మాయని తెల్లచొక్కా, గీయని నల్లగడ్డం
ఆనవాళ్లు: మాయని తెల్లచొక్కా, గీయని నల్లగడ్డం
సందేహం: ఢిల్లీ గల్లీల్లోనే తచ్చాడుతున్నాడని...
గమనిక: నీ రాకకోసం... రాజమాత అంతర్వాణిని అక్కున చేర్చుకుని రేయింబవళ్లూ వెక్కివెక్కి ఏడుస్తోంది. వృద్ధమంత్రి ఎప్పట్లాగే మౌనంగా మనసులో
రోధిస్తున్నాడు. వంధిమాగధులు, భట్రాజులు గుండెలవిసేలా భోరున
విలపిస్తున్నారు. వివరం తెలిస్తే కాకితో కబురుపెట్టండి. వీలైతే, కాబోయే
ప్రధానికి కచ్చితంగా నీవేనని చెప్పి, ఒప్పించి వెంటకబెట్టుకు వచ్చినవారికి
మెచ్చే నజరానా ఉండును.
నేటి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో Mr Perfect రాహుల్ బాబాపై ఓ చిన్ని లైటర్ వీన్ సెటైర్! :-)
నేటి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో Mr Perfect రాహుల్ బాబాపై ఓ చిన్ని లైటర్ వీన్ సెటైర్! :-)
"వృద్ధమంత్రి ఎప్పట్లాగే మౌనంగా మనసులో రోధిస్తున్నాడు. "
ReplyDeleteWell said.
చాలా బాగుంది, పట్టుకొచ్చిన వారి నెత్తిన.......పెట్ట్టరు కదా...:-))
ReplyDeleteహహ్హా...
Deleteఆరు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న తంతు, ఆపై అలవాటుగా మారి, ఇప్పుడది ఇన్ స్టింక్టుగా కూడా తయారయ్యుంటుంది. అడిగిన వారికీ, అడగని వారికీ కలగలిపి అందరికీ నెత్తిన చెయ్యితో పాటే శఠగోపం పెట్టడం కాంగ్రెస్ ఆనవాయితీ. అర్థం చేసుకోరూ...?! :-))
hahah super
ReplyDeleteథాంక్స్ కిట్టయ్యా :-)
ReplyDeleteHhaa hha:-):-):-)mee blog ippude chusaanu, chaalaa baagunnaayi mee posts :-):-):-):-):-):-)
ReplyDeleteహమ్మయ్య బ్రతికించారుపోండి, ఇప్పటికైనా చూశారు, అదే పదివేలు!!
Deleteఅసలెప్పటికీ నా బ్లాగు చూడరేమోనని చాలాకాలంగా బెంగగా, బాధగా, భయంగా ఉండేది నాకు(just for fun) !!
Thanks Karthik for your smiley comment :-))