Tuesday, 31 December 2013

మందులేని మాయరోగం!

రోగి: ‘కాంగీ’వాలా
వయసు: 65కు పైమాటే
జబ్బు: అంతుచిక్కని వ్యాధి
వదంతి: ‘చేత’బడి జరిగిందని
అందిన చికిత్స: చీపురు వైద్యం
ప్రస్తుత పరిస్థితి: కారుణ్య కోమా
ఇప్పుడెక్కడ: వెంటిలేషన్ మీద
వైద్యులు: డాక్టర్ సింగ్ & డాక్టర్ రాహుల్
‘కాంగీ’వాలా బతికి బట్టకట్టాడా? బాల్చీ తన్నేశాడా? 
గడ్డం నెరసిన కురువృద్ధ వైద్యుడు, గడ్డం గీయని కత్తిలాంటి కుర్ర డాక్టర్ల శ్రమ ఫలించిందా?
వివరాలకు ఇవాల్టి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో పబ్లిషైన ఈ లైటర్ వీన్ సెటైర్ చదవండోయ్. థాంక్యూ!



10 comments:

  1. బాగా ఫన్నీగా వ్రాసారు కాని, వ్యంగ్యం కోసం లాజిక్కుని తన్నించేయకూడదు. క్యాన్సర్ అంటువ్యాధి ఎప్పట్నుంచో ;)

    ReplyDelete
    Replies
    1. హహ్హా.. మీరు పట్టేశారండీ. ఏదో ఫ్లోలో పడి అలా రాసుకుంటూ పోయా. ఇంకా నయ్యం. అదేదో కొత్త జబ్బు అన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే డాక్టర్లంతా మీద పడి కొట్టేసేవాళ్లు. థాంక్సండీ. భవిష్యత్తులో జాగ్రత్త వహిస్తాను :-)

      Delete
  2. నిజమే కదా, గడ్డి తిన్నాడనే ఒక రోగికి చాలా వైద్యం అవసర మైంది,
    ఇక బొగ్గూ, వైర్లూ, రాళ్ళొ,రప్పలూ తింటే ఎలా, దానికి "భూత " వైద్యమే సరి అదీ చీపురుతో...:-))
    కలానికున్న బలాన్ని తెలిపే మీ సెటైర్లు , ఇతర టైర్లను దాటి పరుగులెత్తుతున్నాయి.
    కీప్ ఇట్ అప్ తమ్ముడూ,

    ReplyDelete
    Replies
    1. కలానికున్న బలం; టైర్లను దాటిన సెటైర్లు... వాహ్... ఎంత బాగా చెప్పారు.
      అంతా అక్కాభిమానాశీర్వాదాశీస్సుల చలువ కాబోలు :-)
      PS: అక్కాభిమానాశీర్వాదాశీస్సులు = అక్క+అభిమాన+ఆశీర్వాద+ఆశీస్సులు; ఇది ఏ సంధి అయినదీ ఇదమిద్ధంగా చెప్పలేకపోతున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాను :-)

      Delete
    2. ఏమాత్రమూ చింతించ వలదు, రేపు తెలుగు పండితులను ( నేను తెలుగు ఎం.ఎ అయినప్పటికినీ) పిలిపించి , దాని సంది ఏమిటో అన్న్ని గొందులూ వెతికిద్దాం.:-))

      Delete
    3. హహ్హా... ఈ తెలుగు వాళ్లున్నారు చూశారూ, గొప్ప అసాధ్యులు బాబోయ్. దేన్నీ అంత వీజీగా వదిలేట్టు లేరు. భేషో... :-)

      Delete
  3. చాలా బాగా రాశారు.

    వైద్యం ఫలించి పేషంటు లేచి కూర్చుంటాడని ఆశిస్తున్నాను. :)

    ReplyDelete
    Replies
    1. రమణ గారూ, థ్యాంక్సండీ.
      నా మట్టుకు నేనైతే, జనమందరిలాగే, పేషెంటు ఆ మొండిజబ్బుతో మినిమమ్ ఓ దశాబ్దకాలం కోమాలో ఉండాలని గాఠ్ఠిగా కోరుకుంటున్నాను.

      Delete